చిరంజీవి మ్యాజిక్ కోసం క్లిక్ చేయండి
2017
ఖైదీ నంబర్ 150
ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినం చేశారు. రైతు సమస్యలపై పోరాటం నేపధ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. శంకర్ రైతులకు అనుకూలంగా పోరాటం చేస్తు జైలుకు వెళతాడు. అదే రూపంతో ఉన్న నేరస్తుడైనా శ్రీను శంకర్‌లా నటిస్తూ విలన్ దగ్గర డబ్బు కొట్టేయడానికి ప్రయత్నిస్తాడు. శంకర్ పోరాటం గురించి తెలుసుకున్న శ్రీను మారిపోయి రైతులకోసం పోరాటం చేసి ప్రజలను గెలిపిస్తాడు.
2007
శంకర్ దాదా జిందాబాద్
రేడియో జాకీ అయిన జాహ్నవి అనే యువతిని ప్రేమించడం కోసం శంకర్ అనే దాదా ప్రోఫెసర్‌గా నటిస్తుంటాడు. జాహ్నవికి శంకర్ నిజ స్వరూపం తెలుసుకుంటుంది. ఆ తరువాత నిజంగా మచివాడుగా మారి వృద్ధులు ఉంటున్న వృద్ధాశ్రమాన్ని వారికి తిరిగి వచ్చేలా చేస్తాడు. ఇందుకోసం ప్రొఫెస్గా నాటకమాడినప్పటి గాంధీ మార్గాన్నే ఎంచుకుంటాడు.
2005
అంధరివాడు
ఈ సినిమాలో కూడా చిరంజీవి ద్విపాత్రాభినం చేశాడు. గోవిందరాజులు (తండ్రి చిరంజీవి) గతంలో మేస్త్రీ. ప్రస్తుతం అందరి సమస్యలు తీరుస్తూ 'అందరివాడు' గా మన్ననలు అందుకుంటూ ఉంటాడు. అతనికి ఏకైక ముద్దుల కొడుకు సిద్ధార్ధ (కొడుకు చిరంజీవి) అంటే విపరీతమైన ప్రేమ. సిద్దార్ధకు తండ్రి అంటే ప్రేమ ఉన్నా ఆయన వ్యవహారశైలి నచ్చదు. తండ్రిని మార్చుదామని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు.
2004
అంజి
1932 లో భాటియా అనే వ్యక్తి ఎలాగైనా ఆ ఆత్మ లింగాన్ని సంపాదించి ఆకాశ గంగను తాగాలని ప్రయత్నం చేస్తాడు. ఒక మాంత్రికుని సాయంతో ఒక ఆ ఆత్మలింగాన్ని చేజిక్కించుకోవాలనుకుంటాడు కానీ ఆ ప్రయత్నంలో విఫలమై తన కుడి చేయిని కోల్పోతాడు. 72 ఏళ్ళ తర్వాత ఒకరోజు ప్రమాదవశాత్తూ లోయలోపడ్డ అంజికి ఆత్మలింగం కనిపిస్తుంది. దాన్ని గురించి తెలుసుకున్న భాటియా వారిని వెంబడిస్తాడు.
2004
శంకర్ దాదా (చిరంజీవి) కొంతమందితో కలిసి రౌడియిజం చేస్తుంటాడు... కాని తన తల్లితండ్రులు కు ఇదంత తేలియదు.. వారికి తమ కొడుకు MBBS పూర్తిచేసి... డాక్టర్ గా పనిచేస్తున్నాడు అని వాళ్ళు అనుకోనేలా ప్రవర్తిస్తుంటాడు... కొంత కాలం తర్వత శంకర్ దాదా అమ్మ నాన్న డాక్టర్ కాదని, రౌడియిజం చేస్తుంన్నాడు తేలుస్తుంది.
2003
ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు. దాన్ని లంచంతో కొనొద్దు` అంటూ జాగృతం చేశాడు ఠాగూర్. ప్రొఫెస్ తన వద్ద చదువుకున్న విద్యార్థులతో ACF స్థాపంచి అవినీతి అధికారులనుండి సమాజాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంటాడు.
2002
ఇంద్ర
రాయలసీమలో నీటి కష్టాలపై హీరో పోరాడుతుంటాడు. హీరో ప్రయత్నాలకు విలన్ అడ్డు తగులుతుంటాడు. ఈ ప్రయత్నంలో హీరో నగర బహిష్కారానికి గురవుతాడు. తిరిగి వచ్చిన తరువాత సమస్యను పరిష్కరించడానికి విలన్ కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్ళిచేసుకోవడానికి అంగీకరిస్తాడు. రెండు కుంటుంబాలు, రాయలసీమ గ్రామాల మధ్య శాంతి నెలకల్పాలనే తపనతో హీరో చేసే ప్రయత్నాలే ఇంద్ర సినిమా
2001
డాడీ
రాజ్ ఓ ఆడియో కంపెనీ ఓనర్. ఓ సారి మిత్రుడు మోసం చేస్తే రాజ్ డబ్బు కట్టాల్సి వస్తుంది. అదే సమయంలో బిడ్డకు ప్రమాదం జరుగుతుంది. సమయానికి డబ్బు అందక పాప ప్రాణం పోతుంది. అందువల్ల శాంతి, భర్తను వదలి పోతుంది. విడిపోయిన తరువాత పుట్టిన ఐశ్వర్యకు కూడా స్కూల్ లో ఓ ప్రమాదం సంభవిస్తుంది. అప్పుడు మొదటి కూతురు పేరుమీద పెట్టిన ఆసుపత్రిలో చేర్పిస్తారు.
2001
మృగరాజు
చిరంజీవి,సిమ్రాన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా మృగరాజు.. ఈ సినిమాలో అడవికి రారాజు సింహం ది లీడ్ రోల్.. ఒ రైల్వేలైన్ నిర్మాణానికి అడ్డుపడడానికి హీరో, హీరోయిన్ కలసి చేసిన ప్రయత్నాలే మృగరాజు సినిమా. నిజానికి హీరో హీరోయిన్లు అప్పటికే పెళ్ళై విడిపోయిన భార్యా భర్తలు. వీళ్ళద్దరిని సింహం వేట ఎలా దగ్గర చసిందనేదే చిత్ర కథ
2000
హైదరాబాద్‌లో జరిగిన బాంబ్ బ్లాస్ కేసు చుట్టూ ఈ సినిమా తిరుగుతంది. ఈకేసును సీబీఐ ద్యర్యాప్తు చేస్తుంది. ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీకి చెందిన ఓ అధికారి ఢిల్లీనుంచి వస్తుంది. ఓ అవినీతి అధికారి ఆమె ప్రయత్నాలను అడ్డుకోవడం... వాటన్నింటికీ ఛేదించి ఆ కేసు దర్యాప్తు ఎలా ముగించారన్నదే ఈ చిత్రం.
2000
తమ్ముళ్ళంటే ప్రేమ కలిగిన వ్యక్తి పాత్రలో చిరంజీవి నటించారు. అయితే తాను ఎంతో ప్రేమగా చూసుకున్న తమ్ముళ్ళే పరిస్థితుల కారణంగా దూరమై పోతారు. తనతో విభేదించి వెళ్లిపోయినా అన్నయ్య వాళ్ళకు రహస్యంగా సహాయం చేస్తుంటారు. చివరకు అన్నా తమ్ముళ్ళ మధ్య విభేదాలు తొలగిపోయి అందరూ ఒక్కటవుతారు.
1999
ఇద్దరు మిత్రులు ఆడ, మగ మధ్య ఉండే స్వచ్ఛమైన స్నేహానికి ప్రతీకలా రూపొందింది. చిరు స్నేహితురాలి పాత్రలో గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్‌లా ఉన్న సాక్షి శివానంద్ నటించింది. స్నేహమంటా ఇద్దరు మగ, ఇద్దరు ఆడవాళ్ళ మధ్యేకాదు, ఒక మగ ఒక ఆడ వ్యక్తుల ఉంటే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన సినిమా ఇది.
1998
న్యూజిలాండ్‌లో ఉండే రాజు(చిరంజీవి), స్వప్న(రంభ) ప్రేమించుకుంటారు. భారత్‌కు వచ్చిన రాజు ఓ సందర్భంలో గర్భిణి అయిన సంధ్య(రచన) ఇంటికి ఆమె భర్తగా వెళ్తాడు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? సంధ్య ఎవరు? తాను ప్రేమించిన స్వప్నకు, సంధ్యకు సంబంధం ఏంటి? చివరకు సంధ్యను ప్రేమించిన వ్యక్తికి రాజు దగ్గర చేశాడా? అన్నది కథ!
1998
రామకృష్ణ అనే వ్యక్తి కలకత్తాకు కొత్తగా రావడంతో కథ మొదలవుతుంది. బెంగాలీ భాష తెలియక ఇబ్బంది పెడుతూ ఒక చిన్న అపార్టుమెంటుకు చేరుకుంటాడు. అక్కడ ఇద్దరు తెలుగు వాళ్ళు ఆ అపార్టుమెంటును నిర్వహిస్తూ ఉంటారు. వారితో మాట్లాడి ఎప్పట్నుంచో అద్దె కట్టకుండా ఓ గదిలో ఉంటున్న పద్మావతి అనే తెలుగు అమ్మాయితో పాటు గదిలో దిగుతాడు.
1997
మాస్టర్
కళాశాల ప్రిన్సిపాల్ జనార్దనరావు ( విజయ్ కుమార్ ), విద్యార్థులలో క్రమశిక్షణను పెంపొందించాలని భావిస్తాడు. అతని ఒకప్పటి విద్యార్థి రాజ్‌కుమార్ ( చిరంజీవి ) ను అక్కడ తెలుగు లెక్చరర్‌గా నియమిస్తాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో రాజ్‌కుమార్ ఐదేళ్లపాటు జైలుకు వెళ్తాడు. జైలు శిక్ష అనుభవింస్తాడు. తన ప్రేయసిని చంపిన వ్యక్తితోపాటు, తన విద్యార్థి ప్రేమకు అడ్డుగా ఉన్న డిఆర్‌పై కక్ష తీర్చుకుంటాడు రాజ్‌కుమార్.
1997
చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తన చెల్లెళ్లకు తానే తల్లి తండ్రి అయి పెంచి పోషిస్తాడు కథానాయకుడు. అయితే ఓ వయసు వచ్చాక చెప్పుడు మాటలు, అపార్థం చేసుకుని ఎవరి దారి వారు చూసుకునే విధంగా అన్నయ్య ను మోసం చేస్తారు. ఈ నేపథ్యంలో వారు తిరిగి తన అన్నయ్య ఎలా చేరుకున్నారు అనేదే ఈ సినిమా కథ.
1996
గ్రామ ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి సిపాయి. అతను గ్రామంలోని శాంతి అనే యువతిని ప్రేమిస్తాడు. కానీ కుటుంబ సభ్యులు ఓ నేరస్తుడికి ఆమెనిచ్చి పెళ్ళిచేయాలని భావిస్తారు. ఆ సమయంలో చిరంజీవి తన ప్రియురాలు శాంతిని ఎలా దక్కించుకుంటాడన్నదే సిపాయి సినిమా కథ.
1995
రెండు మాఫియా ముఠాల మధ్య జరిగిన గొడవకు హీరో సాక్షిగా మారతాడు. అ సందర్భంగా ఓ గ్రూపు అతనిని చేరదీసి డాన్ కావాలని ప్రోత్సహింస్తుంది. ఆ తరువాత తనకుటుంబాన్ని నాశనం చేసింది కూడా ఆ మాఫియా నాయకుడే అని తెలుసుకుంటారు. విలన్ల ఆట ఎలా కట్టించారన్నదే ఈ సినిమా.
1995
మారూమూల గ్రామంనుంచి పట్నం వచ్చిన వ్యక్తి రిక్షానడుపుతూ జీవినం సాగిస్తుంటాడు. పరిస్థితులు అతనిని ఓ రాజకీయ నాయకుడి కుమార్తెను వివాహం చేసుకునేలా చేస్తాయి. ఆ తరువాత తన మామే తన కుంటుంబం ఛిన్నాభిన్నం కావడానికి కారణమని తెలుసుకుంటాడు.
1995
సీతారాముడు తండ్రి ముప్ఫై ఏళ్ళుగా ఊరికి పంచాయితీ ప్రెసిడెంటుగా పనిచేస్తుంటాడు. వీరి కుటుంబాన్నే కాక ఊళ్ళో వారందరినీ అదే ఊళ్ళో ఉన్న వసుంధర ఆమె సోదరుడు పెద్దయ్య వేధిస్తూ ఉంటారు. అంతేకాదు అన్యాయంగా సీతారాముడిపై నిందమోపి అరెస్టు చేయిస్తారు. జైలునుంచి వచ్చిన తరువాత ఆ కుటుంబంపై పగతీర్చుకుంటాడు.
1994
హీరో తమ్ముడు(హరీష్) బ్లూ ఫిలిమ్స్ తీస్తూ స్కామ్‌లో చిక్కుకుంటాడు. ఈ సమయంలో నిజాయితీగల పోలీసులు అధికారిగా, కష్టాల్లో ఉన్న తమ్ముడిని రక్షించుకోవాల్సిన బాధ్యత కలిగిన అన్నగా హీరో నలిగిపోతాడు. మరోవైపు హీరోయిన్ శ్రీదేవి అంధురాలు.
1994
విజయ్ చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. మరోవైపు కోట్ల రూపాయలను దొంగిలించే దొంగగా కూడా కనిపిస్తాడు. తనకు ఎదురైన చేదు అనుభావల నేపధ్యంలో చిన్నారులకు ఉచితంగా విద్యను అందించేందుకు ఈ దొంగతనాలు చేస్తుంటాడు. పోలీసుల నుంచి తప్పించుకుంటూ తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నదే సినిమా.
1994
ఒకే సారి పుట్టిన ముగ్గరు కవలలు దురదృష్టవశాత్తు పుట్టినప్పుడే విడిపోతారు. అయితే తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ముగ్గురు కలుస్తారు.
1993
టీవీఛానల్‌లో పనిచేసే రవికి ఉద్యోగం పోతుంది. దాంతో అతను మెకానిక్‌గా గ్యారేజీలో జాయిన్ అవుతాడు. గ్యారేజ్ ఓనర్ కూతురిని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలసిన హీరోయిన్ తల్లి రవి తన శత్రువు కొడుకని తెలుసుకుని అతనిని తిరస్కరిస్తుంది. మామ సాయంతో ఎలా అత్తను దారిక తెచ్చాడన్నదే కథ.
1993
బోస్ ఒక సాధారణ వ్యక్తి. మార్కెట్లో కూలీ పనులు చేసుకునే మేస్త్రి. మార్కెట్‌ను కొంతమంది కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటుంటాడు. ఈ క్రమంలో రాజకీయాల్లోకి రమ్మని ముఖ్యమంత్రినుంచి పిలుపు వస్తుంది. రాజకీయాల్లోకి వచ్చిన బోస్ అవినీతిపై ఎలా పోరాటం చేసేడన్నదే ఈ సినిమా.
1992
నిరుద్యోగి అయిన రాజ తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం చిన్నచిన్న పనులు చేస్తుంటారు. పెద్దన్నయ్యను కొంతమంది చంపారని తెలుసుకుని వారిపై పగతీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. రెండో అన్నయ్య విలన్ల మధ్య చిక్కుకుంటాడు. ఈ సమస్యల మధ్య తన పగ ఎలా తీర్చుకున్నాడనదే ఆజ్గా గూండారాజ్.
1992
మాధవుడు ఒక పల్లెలో పశువుల కాపరి. ఒక ఉపాధ్యాయుడి ఇంటికి నమ్మకమైన తోడు. ఉపాధ్యాయుని కూతురు హేమ కి మాధవుడు మంచి స్నేహితుడు. గర్భవతిగా ఉన్న అక్కకు సాయంగా వెళ్ళిన హేమ బావ అత్యాచారానికి గురై పిచ్చిదైపోతుంది. ఆమెను కాపాడడానికి మాధవుడు పిచ్చివానిలా నటించి ఆమె ఉన్న పిచ్చాసుపత్రిలో చేరి ఎన్నో బాధలను సహిస్తాడు.
1992
అహంకారి అయిన పారిశ్రామికవేత్త కుమార్తె ఉమ. ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసే వ్యక్తితో గొడవలు రావడంతో అతనికి బుద్ది చెప్పడానికి అతనినే పెళ్ళి చేసుకుంటుంది. బుద్ది చెబుతామని పెళ్ళి చేసుకున్న భార్యను భర్త ఎలా దారికి తెచ్చుకున్నాడన్నదే ఈ సినిమా కథ.
1991
స్టూవర్ట్ పురం అంటే దొంగల ఊరు అని పేరు. అక్కడి ప్రజలు మారదామని ప్రయత్నించినా పోలీసులు, ఇతరులు మారనివ్వరు. హీరో రాణా పోలీసు ఇనస్పెక్టర్‌గా సొంత ఊరిని మార్చాలని నిర్ణయించుకుంటాడు
1991
ముగ్గురు అన్నదమ్ముల్లో రాజారామ్ ఒకరు. చిన్నఅన్నయ్య చదువుకోసం చెయ్యని నేరం అంగీకరించి జైలు వెళతాడు. జైలు నుంచి వచ్చే సరికి పెద్దన్నయ్య హత్యకు గురవుతాడు. హత్య చేసిన వారిపై పగ సాధిస్తాడు రాజారామ్
1991
డబ్బున్న పరిశ్రామిక వేత్త కళ్యాణ్, ఆటో డ్రైవర్ జానీ పాత్రల్లో చిరంజీవి నటించారు. శత్రువులు కళ్యాణ్ స్థానంలో జానీని తీసుకొస్తారు. చివరకు కళ్యాన్ మంచితనం గురించి తెలుసుకున్న జానీ విలన్ల ఆట కట్టిస్తాడు.
1990
రాజా విక్రమార్క ( చిరంజీవి ) ఒక చిన్న రాజ్యమైన స్కంద ద్వీపపు యువరాజు. జీవితం అనేక నిర్భందాల మధ్య సాగుతుండేది. తనకు కావలసిన యువతికోసం రాజ్యంనుంచి బయటకు వస్తాడు. చివరకు ఆమెకే బాడిగార్డుగా మారి శత్రువులనుంచి రక్షిస్తాడు.
1990
నిజాయితీ గల పోలీసు ఇనస్పెక్టర్ సిద్ధాంత్. ఒక హత్యకేసులో సాక్షి అయిన శాంతిని విలన్లనుంచి రక్షిస్తాడు. ఈ గొడవల్లో తన భార్యను సైతం కోల్పోతాడు. శత్రువులనుంచి శాంతిని ఎలా రక్షించాడు.. విలన్లకు ఎలా బుద్ది చెప్పాడన్నదే సినిమా కథ
1990
అనుకోకుండా ఇంద్రుడు కుమార్తె ఇంద్రజ భూలోకం వస్తుంది. తన ఉంగరం పోగోట్లుకుంటుంది. రాజు వద్ద ఉన్న తన ఉంగరాన్ని తిరిగి తీసుకుందా? అందుకోసం ఆమె చేసిన ప్రయత్నాలు, దేవ కన్యను వశం చేసుకునేందుకు విలన్లు పన్నిన పన్నాగాలను హీరో ఛేదించి ఆమెను కాపాడుతాడు.-
1990
భరత్ అన్యాయాలను, అక్రమాలను అడ్డుకునే కౌబాయ్. ఒక సారి ఓ ముఠా మీద దాడిచేయగా.. ప్రతీకారదాడిలో తల్లిదండ్రులను కోల్పోతాడు. చనిపోతు తాము అసలైన తల్లిదండ్రులం కాదనే నిజం చెబుతారు. తన తల్లిదండ్రులెవరో తెలుసుకుని వాళ్ళను కష్టాలనుంచి గట్టెక్కిస్తాడు.
1990
తండ్రి హత్యకేసులో తల్లికి జైలుకు వెళుతుంది. వాళ్ళ కుమారుడు రాజాను గూడెం నాయకుడు కాపాడుతాడు. బాగు చదువుకున్న రాజా తన గూడెం ప్రజలను మోసం చేస్తున్నవారు, తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి కొండవీటి దొంగ అవతారమెత్తుతాడు.
1989
అత్తకి యముడు అమ్మాయికి మొగుడు సినిమాకు తమిళ రిమేక్ ఇది. కథానాయకుడి వివాహం చెడగొట్టటానికి వచ్చిన అల్లరి మూకతో ఫయిట్ చేసి గుడి మెట్ల దగ్గిరే వారిని పంపించే నాయకుడి స్నేహితుడిగా చిరు ఇందులో ప్రత్యేక పాత్రని పోషించాడు.
1989
ఏజెంట్ నేత్ర ( చిరంజీవి ) స్త్రీలోలుడు. అతను సత్యనారాయణ (రంగనాథ్) నడుపుతున్న డిటెక్టివ్ ఏజెన్సీలో పనిచేస్తూంటాడు. మాదక ద్రవ్యాల గ్యాంగ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో నేత్ర అగ్ని ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తుంది.
1989
అనాధ అయిన శంకర్ ఒక గ్రామానికి సహాయం చేస్తాడు. ఆ గ్రామస్థులు అతన్ని దేవుడిలా చూస్తారు. దొగ జీవితాన్ని వదిలి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. కానీ విలన్లు శంకర్ బావమరిదిని చంపాలనుకోగా.. వాళ్ళను ఎదరిస్తాడు.
1989
పోలీసు అధికారిగా సాధించలేని పనిని రౌడీగా మారి చేయాలని అనుకుంటాడు కాళీ చరణ్. రాష్ట్రంలోని రౌడీలందరినీ కిడ్నాప్‌చేసి వారికి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాడు.
1989
కళ్యాణ్ చెల్లెలు ధనవంతుడైన, తల్లికి భయపడే వ్యక్తిని ప్రేమిస్తుంది. తాను స్నేహితురాలు కూడా అదే మహిళ కూతురు అని తెలుస్తుంది. దీంతో అత్తకు గుణపాఠం నేర్పి తన చెల్లెలు, తాను ప్రేమించిన వాళ్ళను పెళ్ళి చేసుకుంటారు.
1988
గోపి గ్రామంలో సంగీతం నేర్చుకుంటూ పెరుగుతాడు. పోలీస్ కానిస్టేబుల్ కావాలనుకుంటాడు. తనపై నిందమోపిన రాధను క్షమించినా.. తనపై కక్ష పెంచుకున్న మామకు గుణపాఠం నేర్పుతాడు.
1988
కాళి (చిరంజీవి) ఒక చిన్న పట్టణంలో చిన్నపాటి రౌడీ. కాళి తన కూతురుని ప్రేమిస్తున్నాడని తెలిసిన కైలాసం కాళీని చంపిస్తాడు. చనిపోయిన కాళీ నరకానికి వెళతాడు. అక్కడ తనను అన్యాయంగా తెచ్చారని యముడితో (కైకాల సత్యనారాయణ) గొడవ పడతాడు.
1988
ఒక సైనిక అధికారి సెలవుల్లో తన గ్రామానికి వస్తాడు. కాని తన గ్రామం పరిస్థితిని చూసి, దుష్టుడైన భూస్వామి వలన ప్రజలు ఎదుర్కొంటున్న దురాగతాలకు వ్యతిరేకంగా నిలబడతాడు.
1988
వీరేంద్ర దొంగ అయినా మంచి మనసు కలిగిన వ్యక్తి. ఒక లేడీ పోలీసు తారసపడిన తరువాత మారిపోవాలనుకుంటాడు. అంతేకాదు. అన్యాయాలపై పోరాటం చేయడానికి పోలీసు శాఖలో చేరతాడు.
1988
ఒక గొప్ప సంగీత విద్వాంసుడి కుమారుడు సూర్యం. సంగీతంతో సమాజాన్ని మార్చాలని భావిస్తాడు. సాంప్రదాయాలను పాటించే తండ్రికి ఇష్టం లేని దళిత యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. అంతేకాదు మద్యానికి బానిసైన గ్రామాన్ని మార్చి ప్రభుత్వ సన్మానాన్ని పొందుతాడు.
1988
జానీ (చిరంజీవి) తన భాగస్వామి భిల్లు (నాగేంద్ర బాబు) తో కలిసి చిన్నపాటి క్యాసినో నడుపుతూంటాడు. కొకైన్ వ్యాపార మూలాలను తెలుసుకునేందుకు వీరిద్దరు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో అక్రమార్కుల ఆట కట్టించడంతోపాటు, అనూష ప్రేమలో పడతాడు జాని.
1988
గోవా తీరం డి.డి అనే పేరుగల ఒక మాఫియా చేతిలో ఉంటుంది. అతను బయటికి మంచివాడుగా కనిపిస్తూ లోలోపల డ్రగ్ మాఫియా నడుపుతుంటాడు. ఈ మాఫియా గుట్టు రట్టు చేయడానికి అభిమన్యుని సీబీఐ విచారణ అధికారిగా నియమితులవుతారు.
1987
ఎవరికీ అన్యాయం చేయ్యని ఒక వ్యక్తి గ్రామంలోని ఒక ప్రముఖ వ్యక్తి దారుణానికి గురువు ప్రాణాలు కోల్పోతాడు. గురువు మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడు.
1987
చదువు లేని చెప్పులు కుట్టుకునే వ్యక్తి సాంబయ్య. సోదరి కుమారుడిని పెంచుకుంటాడు. శారతను ప్రేమించిని పెళ్ళి చేసుకోలేపోతాడు. గంగను పెళ్ళి చేసుకున్న సాంబయ్య సోదరి భర్తనుంచి ఎదురైన కష్టాలను ఎదుర్కొంటాడు.
1987
లిరాజు చిన్నపాటి రౌడీగా చలామణి అవుతుంటాడు. అదే ఊరికి జెన్నిఫర్ ఉపాధ్యాయురాలిగా వస్తుంది. ఒకసారి జెన్నిఫర్ పులిరాజు తన తల్లిని అవమానంగా మాట్లాడుతుంటే మందలిస్తుంది. పులిరాజు ఆమె మీద తన సహజ స్వభావమైన పగ తీర్చుకోవడానికి బదులుగా ఆమెను ఆరాధిస్తూ ఆమె దగ్గర విద్యార్థిగా చేరతాడు.
1987
పారిశ్రామిక వేత్త అయిన రవితే భార్య, అత్త వేధింపులు భరించలేక ప్రియం వదకు దగ్గరవుతాడు. ఈ క్రమంలో అతని స్థానంలో నాగరాజు రవితేజ స్థానంలోకి వచ్చి భార్య, అత్తలకు బుద్ది చెప్పడమే కాకుండా విలన్ల ఆట కట్టిస్తాడు.
1987
జిమూంబా అనే విదేశీయుడు కొంతమంది భారతీయులతో కలిసి దేశ అభివృద్ధిని కుంటుపరచడానికి కొన్ని పథకాలు రచిస్తుంటాడు. దేశంలో అనేక చోట్ల ఈ ముఠా అల్లర్లకు పాల్పడుతూ ఉంటుంది. ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వస్తుంది. ముఠా రహస్యాలను బయట పెట్టడం కోసం సిబిఐ ఒక ఏజెంటును నియమిస్తారు.
1987
పెళ్ళి జరిగిన రోజునే ప్రేయసి (సుమలత)ని కోల్పోయిన పెయింటర్ మధు (చిరంజీవి) తాగుబోతుగా మారతాడు. అతనికి మూగవాడైన పిల్లవాడు రోడ్డుపై కనిపిస్తే చేరదీస్తాడు. ఆ బాలుడిని విలన్ల బారినుంచి మధు రక్షిస్తాడు.
1986
చిరు, సత్యనారాయణ చిన్న కుమారుడు. మధ్యతరగతి అమ్మాయి (జయసుధ) తో ప్రేమలో పడి అతని అన్నలూ, అక్కలూ అంగీకరించకపోయినా ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. అన్నలు ఆస్తి కోసం తగువులాడుకుంటారు. చిరు ఒక పరిస్థితిలో జైలుకు వెళతాడు. జైలు నుండి బయటకు వచ్చి చిరు తన కుటుంబాన్ని ఎలా ఏకం చేస్తాడనేది మిగతా కథ.
1986
కిషోర్ అనే నిరుద్యోగ యువకుడు తన సోదరుడు శ్రీనివాసతో కలిసి జీవిస్తున్నాడు. కిషోర్ కిడ్నాపర్ల నుండి లావణ్య అనే అమ్మాయిని కాపాడే సమయంలో గొడవ పడతాడు. అప్పటినుంచి అతనికి కష్టాలు ప్రారంభమవుతాయి.
1986
ఒక పురావస్తు శాస్త్రవేత్త సహాయకుడు ఒక రహస్య నిధి రహస్యాన్ని వెలికితీసేందుకు ఒక గ్రామానికి వెళ్తాడు. అందుకోసం తనకు ఇష్టంలేకపోయినా తన సోదరిని చంపిన ధనవంతుడితో స్నేహం చేయాల్సి వస్తుంది.
1986
చాణక్య ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారిగా పనిచేస్తుంటాడు. రాణా స్మగ్లింగ్ రింగ్‌ను చాణక్య పట్టుకుంటాడు. అందుకు ప్రతీకారంగా వాళ్ళు, చాణక్య తండ్రి వజ్రాలను అక్రమంగా రవాణా చేస్తున్నాడని నిరూపిస్తారు. తండ్రి నిజయితీని రుజు వేస్తానని చాణక్య శపథం చేస్తాడు.
1986
పాండురంగారావు ఒక డిటెక్టివ్. అన్నను కనుక్కోమని ఓ మహిళ అతనిని కోరుతుంది. ఈ క్రమంలో కథ ఆసక్తిరమైన మలుపులు తిరిగి.. చివరికి పాండురంగారావే ఆమె సోదరుడని తెలుస్తుంది.
1986
ప్రతాప్ ఒక ఓడలో పని చేస్తుంటాడు. కానీ తాను పెళ్ళిచేసుకోబోయే సరోజను ప్రేమించాడనే కక్షతో జయరాం అనే జమీందారు కెప్టెన్ హత్యను ప్రతాప్ మీదకు తోసి అతన్ని అండమాన్ జైలుకు పంపించి వేస్తాడు. జైల్లో ఉన్న మహేంద్రభూపతి అడవిలో ఉన్న నిధిగురించి చెబుతాడు.
1986
చరణ్, ఒక క్రీడాకారుడు. సీబీఐ అధికారి అయిన తన తండ్రి చక్రవర్తిని ద్వేషిస్తుంటాడు. ఒక క్రిమినల్ గ్యాంగ్‌ను పట్టుకునే ప్రయత్నంలో చక్రవర్తి కిడ్నాప్‌కు గురవుతాడు. ఆ సమయంలో చరణ్ తన తండ్రిని కాపాడాలని నిర్ణయించుకుంటాడు.
1986
అడవి విలన్స్ మధ్య చిక్కుకున్న హీరో అతని స్నేహితుడు అక్కడ నుంచి తప్పించుకుని సిటీకి వస్తారు. హీరో తన తల్లిని వెతుకుతుంటాడు. ఆమె దొరకదు.. ఈ క్రమంలో విలన్స్‌ను హీరో ఎలా ఎదుర్కొన్నాడనేదే ‘రాక్షసుడు’ సినిమా కథ.
1985
ఎస్పీ చక్రవర్తి స్మగ్లర్లను ఎదిరించే నిజాయితీ కలిగిన పోలీసు అధికారి. సర్వోత్తమ అనే గ్యాంగ్ స్టర్ చేతిలో చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న చక్రవర్తి కవల పిల్లలు విలన్లను మట్టుబెట్టడానికి బయలుదేరుతారు.
1985
క్రాంతి (చిరంజీవి) నిజాయితీగల పోలీసు అధికారి. ఇన్స్పెక్టర్ శ్యామ్ అవినీతి అధికారి. స్మగ్లర్ జెకె కోసం పనిచేస్తూంటాడు. ఒక రోజు, శ్యామ్ చేసిన ప్రమాదం కారణంగా లక్ష్మి కంటి చూపును కోల్పోతుంది, ఆమె కాబోయే భర్త మరణిస్తాడు. క్రాంతి దర్యాప్తు చేసి అవినీతి ఇన్స్పెక్టర్ శ్యామ్‌ను అతని సహచరుడు జేమ్స్ నూ పట్టుకుంటాడు.
1985
వసుంధర (శారద), విశ్వం (సూరపనేని శ్రీధర్) ఆదర్శ దంపతులు. ఒక సందర్భంలో తన కొడుకుని పొదల్లో దాచిపెడుతుంది. ఆ తరువాత చూస్తే కొడుకు కనిపించడు. అతడు ఏనుగులు, ఇతర జంతువల మధ్య పెరుగుతాడు.
1985
లోకేశ్వర్ రావు హత్యలో చిక్కుకున్న రవిశంకర్ని కాపాడాలని న్యాయ విద్యార్థి భారతి కోరుకుంటుంది. ఆమె అనుకున్నట్లే ఉరి శిక్ష నుంచి బయటపడిన రవిని పెళ్లి చేసుకుంటుంది.
1985
చిరంజీవి, విజశాంతి ప్రేమించుకుంటారు. వీరి ప్రేమకథ హాయిగా సాగిపోతున్న సమయంలో అనుకోని ఘటన వీరిని విడదీస్తుంది. విజయశాంతి చిరు తండ్రిపై నిందలు వేయడంతో చిరంజీవి ఆమెపై చేయిచేసుకుంటాడు.
1985
తన తండ్రిని చంపిన కోదండరామయ్యపై పగ తీర్చుకోవాలని ఫణి నిర్ణయించుకుంటడు. ఈ ప్రయత్నంలో కోదండరామయ్య కుమార్తె మంజుల ప్రేమలో పడతాడు.
1985
చినబాబు ఒక ఫుట్‌బాల్ ప్లేయర్. తన చెల్లెలకు పెళ్లి చేయడానికి సంపాదిస్తున్న అన్నలు ముందుకు రారు. అప్పుడు చినబాబు తన కుటుంబం కోసం షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు.
1985
నేరస్తుడైన గోపీ వడ్డీ వ్యాపారి వద్దనుండి పోలీసు అధికారితోపాటు, కొంతమంది కూలీలను రక్షిస్తాడు. ఈ క్రమంలో మరణశిక్ష పడిన తనను కూడా కాపాడుకుంటాడు.
1984
రాజా పోలీసు కాలనీలో ఉంటూ మాయలు మోసాలు చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అతను తన సోదరిని, ఆస్తులను విడిచిపెట్టి, నగరంలో బోధకుడుగా నటిస్తాడు, కానీ ఒక అమ్మాయి అతని నిజస్వరూపాన్ని బయటపెడుతుంది.
1984
పురావస్తు శాస్త్రవేత్త కృష్ణ తన స్నేహితుడు విక్రమ్‌తో నిధి కోసం ఒక గ్రామానికి వెళ్తాడు. విక్రమ్ హత్యకు గురవుతాడు. విక్రమ్‌ను చంపిందెవరో తెలుసుకుని పగ తీర్చుకుంటాడు.
1984
నాగు (చిరంజీవి) వృత్తిరీత్యా చిన్నపాటి గుండా. అతను రజని (రాధ) ని ప్రేమిస్తుంటాడు. ఒక రోజు రజని ఒక హోటల్ పై అంతస్తు నుండి పడి చనిపోతుంది. ఆమె హత్యానేరం నాగుపై పడుతుంది. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి నాగు ఏంచేశాడు, ఎలా విజయం సాధించాడన్నది మిగతా కథ.
1984
ఆడుతూ, పాడుతూ సరదాగా ఉండే విజయ్ (చిరంజీవి) అనే యువకుడికి పందాలు కాయడం, ఎలాగైనా ఆ పందెం నెగ్గించుకోవడం అలవాటు. అతను అరుణ్ (హరి) అనే యువకుని హత్య కేసులో ఇరుక్కుంటాడు. అప్పుడు విజయ్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడమే ఈ సినిమా కథ.
1984
ఫ్యాక్టరీ కార్మికుడైన విజయ్, సత్యం అరాచకాలను బయటపెడతాడు. విజయ్ ప్రేమించిన లతను సత్యం తమ్ముడు చిన్నా పెళ్ళి చేసుకుంటాడు. చిన్నా చనిపోవడంతో ఆ నేరం విజయ్‌పై పడుతుంది.
1984
ఇద్దరు మోసగాళ్ళు ధనవంతుడైన ప్రభాకర్ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ప్రభాకర్ ఇద్దరు కూతుళ్ళతో వీళ్ళు ప్రేమలో పడతాడే. అంతేకాదు కష్టాల్లో ఉన్న ఆ కుటుంబాన్ని కాపాడుతారు
1984
భార్య చెల్లలిని పెళ్ళిచేసుకోవాలనుకున్న చక్రపాణి భార్య, కూతురుని చంపాలనుకుంటాడు. చక్రపాణి గురించితెలిసిన అతని ఆర్య అతనికి గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకుంటుంది.
1984
హరితన గ్రామ ప్రజల సంక్షేమం కోసం పనిచస్తుంటాడు. గ్రామ పెద్ద అయిన గంగరాయుడు గ్రామానికి ముప్పు తెలపెడతాడు. గంగరాయుడి భారినుంచి గ్రామాన్ని హరి రక్షిస్తాడు.
1984
గాంధీ అనే యువకుడు ( చిరంజీవి ) ఓ నిరుద్యోగి. ఒక రోజు పేపర్లో ఉద్యోగ ప్రకటన చూసి ఇంటర్వ్యూకు వెళ్తాడు. అక్కడ యజమాని రామ్ మోహన్ రావు ( రావు గోపాలరావు ) డబ్బు అహంకారంతో అతడిని అవమానిస్తాడు. దాంతో చిరంజీవి ఐదు సంవత్సరాలలో 50 లక్షల రూపాయలు సంపాదించి చూపిస్తానని చాలెంజ్ చేస్తాడు.
1984
అనుకోకుండా పక్కింటి వ్యక్తి కళ్ళు పోగోట్టిన యువకుడు ఇంటినుంచి పారిపోతాడు. ఓక దొంత దగ్గర పెరిగిన అతడు చాలా కాలం తరువాత తన కుటుంబాన్ని చేరుకుంటాడు.
1983
రాజు ఒక నిరుద్యోగ యువకుడు. రాజుకు కుటుంబ బాధ్యతలు చాలా ఉంటాయి. అతనికి ఒక పెళ్ళి కాని చెల్లెలు ఉంటుంది. తల్లిదండ్రులు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈ పరిస్థితులలో, రాజు సుహాసినిని ప్రేమిస్తాడు. రాజు, డబ్బు సంపాదించడానికి, సైకిల్ రేసులో పాల్గొంటాడు
1983
తన తండ్రి అసంపూర్ణ కలను పూర్తి చేయాలని నిశ్చయించుకున్న డాక్టర్ శాంతి (రాధిక) గ్రామానికి వస్తుంది. ఆమె రాజన్న ఆమెకు సహాయం చేస్తుంటాడు. శాంతి ప్రయత్నాలను అడ్డుకోవాలనుకునే భూస్వామినుంచి ఆమెను రక్షిస్తాడు.
1983
శివుడు, సాధారణ వ్యక్తి. తన ప్రేయసి రాధికతో ప్రశాంతమైన జీవితం గడుపుతుంటాడు. కొంతమంది రాధికను దారుణంగా కొట్టి చంపేడయంతో శివుడి జీవితం తల్లక్రిందులవుతుంది.
1983
విజయ్ (చిరంజీవి) ఢిల్లీలో ఒక ప్రభుత్వ ఏజెంటు. అతన్ని ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ కోసం ఒక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న చోటికి పంపిస్తారు. ఈ ప్రయత్నంలో ఉండగానే రాథతో ప్రేమలోపడతాడు. విజయ్ వాళ్ళందరినీ విలన్స్ ఆ స్థావరాన్ని ధ్వంసం చేయడంతో కథ ముగుస్తుంది.
1983
1983 లో వచ్చిన సినిమా. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో చిరంజీవతో పాటు, మాధవి, రాధిక, గొల్లపుడి మారుతీరావు ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
1983
తన చదువును మధ్యలోనే ఆపేసి అన్న చదువుకోసం కష్టపడతాడు చిన్నవాడైన చిరంజీవి. రంగనాథ్ చదువుకుని ఉద్యోగం సంపాదిస్తే కష్టాలు గట్టెక్కుతాయని కుటుంభ సభ్యలు ఆశిస్తారు. కానీ రంగనాథ్ ఇంట్లోనుంచి బయటకు వెళ్ళిపోవడంతో చిరంజీవి తన కుటుంబ బాధ్యతను స్వీకరించి, తన చెల్లెలు పెళ్ళి చేయడానికి ప్రయత్నిస్తాడు.
1983
1983 లో కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పులి బెబ్బులి . ఈ చిత్రంలో కృష్ణరాజు, చిరంజీవి, జయప్రద, రాధిక ముఖ్య పాత్రల్లో నటించారు. కమల సినీ ఆర్ట్స్ పతాకంపై ఆర్.వి. గురుపాదం ఈ చిత్రాన్ని నిర్మించాడు.
1983
చిరంజీవి సికిందర్ శ్రీకాంత్ అనే రెండుపాత్రలు పోషించాడు సికిందర్ ఒక పెద్ద రౌడీ, నేరస్థుడు. వజ్రాలు, నగదు, ఆస్తులను స్మగ్లర్ల నుండి దొంగిలించి రహస్య ప్రదేశంలో (దుర్గా ఆలయం) దాస్తూంటాడు. ఒక రోజు స్మగ్లర్లు సికిందర్‌పై దాడి చేస్తారు. తరువాత జరిగే వెంటాడే సీనులో సికిందర్ ప్రమాదానికి గురవుతాడు.
1983
దిలీప్ (చిరంజీవి) యునైటెడ్ స్టేట్స్లో చదువుకున్నాడు. తన తండ్రి స్మగ్లర్ అని తెలుసుకుంటాడు. దే కర్మాగారంలో శ్రామికునిగా చేరతాడు. అతను యూనియన్ నాయకుడి స్థానానికి చేరి తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు.
1983
ధనికుడైన సుబ్బారాయుడు తన స్నేహితుడిని మరచిపోతాడు. సుబ్బారాయుడి కొడుకు శివరాం (శుభలేఖ సుధాకర్) రామభద్రయ్య కూతురు సుశీల (తులసి) తో ప్రేమలో పడతాడు. అందుకు ఇష్టంలేని సుబ్బారాయుడు రామభద్రయ్యను అవమానిస్తాడు. తన తండ్రి అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటానని కొడుకు బాబ్జీ ప్రతిజ్ఞ చేశాడు.
1983
ఒక యువకుడు అనుకోకుండా తన పొరుగువారిని కన్నుమూసినప్పుడు అతని ఇంటి నుండి పారిపోయాడు. ఆ తరువాత, అతను ఒక దుండగుడి ద్వారా పెరిగాడు, కానీ అతన్ని గుర్తించలేని కుటుంబానికి చాలా సంవత్సరాల తర్వాత మాత్రమే అతను ఇంటికి తిరిగి వస్తాడు.
1983
ఒక యువ న్యాయవాది న్యాయ వ్యవస్థ నుండి మరణశిక్షను తొలగించడానికి ప్రయత్నిస్తాడు. తన గురువు మద్దతుతో, అతను ఒక తెలివైన ప్రణాళికను రూపొందిస్తాడు. సగం మధ్యలో ప్లాన్ చాలా తప్పుగా ఉన్నప్పుడు.
1983
నిరుద్యోగి అయిన రవి ప్రేమ ను ప్రేమిస్తాడు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్న సమయంలో మరో ముగ్గురు ప్రేమను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తాడు. ముగ్గురు వృద్ధులు తమ ప్రవర్తన ఒక యువ జంట ప్రేమను ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకుంటారు. వారి ప్రవర్తనకు సిగ్గుపడతారు. ముగ్గురు వృద్ధులు తమ ప్రవర్తన ఒక యువ జంట ప్రేమను ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకుంటారు.
1983
తన తండ్రిని చంపి, చెల్లి జీవితాన్ని నాశనం చేసిన గ్రామ పెద్ద వీరభద్రయ్యపై సూర్యం ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే సినిమా కధ.
1982
సినిమా కథ ఐదుగురు మిత్రుల చుట్టూ తిరుగుంది. ఈ ఐదుగురూ నిరుద్యోగులు. వీరు ఉంటున్న వీధిలోకి కొత్తగా వస్తుంది గీత. ఆమె మంచితనాన్ని చూసి శేఖర్ ఆమెను ఆరాధించడం మొదలు పెడతాడు. సుహాసిని ఈ ఐదుగురు మిత్రులను విజయం సాధించేలా ప్రోత్సహిస్తుంది.
1982
రంగడు చలాకీ యువకుడు. సంపన్నుడైన రామచంద్రరావుకు అక్రమ సంతానమని చెప్పి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆస్తిని కొట్టేయడానికి ప్రయత్నిస్తున్న భూపతి, కోటిగాడులకు ఎలా బుద్ధి చెబుతాడు అనేది మిగిలిన కథ.
1982
రవీంద్ర ఉడుకు రక్తపు యువకుడు, మొండివాడు. నిజాయితీ పరుడైన స్నేహితుడు ఈశ్వర్ ఉద్యోగం పోయిన ఘటనలో తండ్రిముందే కోర్టులో దోషిగా నిలబడతాడు. ఆతరువాత ఈశ్వర్ బాస్ ప్రసాద్‌బాబుపై ప్రతీకారం తీర్చుకుంటాడు.
1982
కిషోర్, విజయ్‌లు చిన్న నాటి స్నేహితులు. అంతేకాదు ఇద్దరూ పోలీసు అధికారులు. వీరిద్దరూ కలిసి అరెస్ట్ చేసిన జాకెల్ జైలునుంచి తప్పించుకుని కిషోర్‌ను హత్యచేస్తాడు. జాకెల్ను విజయ్ ఎలా అంతమొందించాడన్నదే సినిమా కథ
1982
ఇద్దరు మహిళలు పల్లెలో ఉండడం ఇష్టంలేక పట్నంలో కాపురం పెట్టాలనుకుంటారు. అందుకు వారి భర్తలు ఒప్పుకోరు.. దీంతో ఆ ఇద్దరు మహిళలు పట్నం వెళ్ళి పడిన కష్టాల్లో చిక్కుకుంటారు. భర్తలు వారిని రక్షిస్తారు.
1982
రాజశేఖరం ఒక సివిల్ ఇంజనీరు. ఓ పనిమీద పల్లెటూరికి వచ్చి జయలక్ష్మితో ప్రేమలో పడతాడు. వారిద్దరూ పెళ్ళి చేసుకుని నగరానికి వచ్చి కాపురం పెడతాడు. పైకి మంచి మాటలు మాట్లాడుతూ లోపల కుటిల ప్రవర్తన గల సుబ్బారావు జయలక్ష్మి మీద కన్నేస్తాడు.
1982
ఒక దుర్మార్గుడి కారణంగా ఇంట్లోనుంచి బయటకు వచ్చిన లెక్చరర్ సుజాతకు వెయిటర్ మూర్తి ఆశ్రయం కల్పిస్తాడు. అక్కడా ఆ దుర్మార్గుడు వీరి ఉద్యోగాలు తీసేయించడంతో.. హైదరాబాద్ చేరుకుని.. ఆ తరువాత దుర్మార్గుడి ఆట కట్టిస్తారు.
1982
బిల్లా అనే సిఐడి ఆఫీసర్ రవిరాజ్ అనే మారు పేరుతో రహస్య ఆపరేషన్ నిర్వహిస్తుంటాడు. మానవ పుర్రెలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు భార్యా బిడ్డలను వదలి వెళ్ళిపోయిన రంగాను వాళ్ళతో కలుపుతానని హామీ ఇస్తాడు.
1982
గతం మరచిపోయిన వ్యక్తిని ఇనస్పెక్టర్ సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసకొస్తాడు. ఆ రోగినిక కాల్చిన కేసును సైతం విచారిస్తుంటాడు. అయితే ఆ ఇనస్పెక్టర్ మనసికవైద్యుడి భార్య, కాంపౌండర్లనే అనుమానితులుగా భావిస్తాడు.
1982